EAPCET Councelling 2024: ఏ బ్రాంచ్ తీసుకోవాలో సందేహంలో ఉన్నారా??

EAPCET Councelling 2024: తెలుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్‌ కోర్సులపై మక్కువ అత్యంత ఎక్కువగా ఉంది. తమ స్వప్నం సాకారం చేసుకోవడానికి విద్యార్థులు జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌, ఏపీ ఈఏపీసెట్‌ వంటి పలు ప్రవేశ పరీక్షలు రాస్తున్నారు. ఈ ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాక ఏ కళాశాలలో చేరాలి, ఏ బ్రాంచ్‌ చదవాలి అనే ప్రశ్నలు తల్లిదండ్రులు, విద్యార్థుల మనస్సులో ఉంచుకుంటున్నారు.

AP EAPCET బ

ఆధునిక టెక్నాలజీపై పట్టుండాలి

సివిల్‌, సీఎస్‌ఈ, మెకానికల్‌, ఈసీఈ, ఎలక్ట్రికల్‌, కెమికల్‌ బ్రాంచ్‌లు పరిశ్రమల అవసరాల దృష్ట్యా ముందంజలో ఉన్నాయి. ఈ బ్రాంచ్‌లలో సర్టిఫికెట్‌ పొందితే ఉద్యోగాలు ఖాయం అనే అభిప్రాయముంది. అయితే, ఆధునిక టెక్నాలజీపై పట్టు సాధించడం ప్రతి విద్యార్థి కోసం ముఖ్యం.

Telegram Group Join

టాపర్ల గమ్యం – CSE

కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ) అనేది బీటెక్‌ ఔత్సాహిక విద్యార్థుల్లో ప్రాచుర్యం పొందింది. ఐటీ కొలువులు, ఆకర్షణీయ ప్యాకేజీలు ఈ బ్రాంచ్‌తో లభిస్తాయి. ముఖ్యంగా కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌, నెట్‌ వర్కింగ్‌, అల్గారిథమ్స్‌, ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి అంశాలను ఇందులో అధ్యయనం చేస్తారు.

ECE అటు కోర్‌, ఇటు ఐటీ

ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌ (ఈసీఈ) బ్రాంచ్‌ కోర్‌ సెక్టార్స్‌తో పాటు సాఫ్ట్‌వేర్‌ రంగాల్లోనూ మంచి అవకాశాలు కల్పిస్తుంది. ఎలక్ట్రికల్‌ పరికరాలు, శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌, మైక్రో ప్రాసెసర్స్‌ వంటి అంశాలను ఇందులో చదువుతారు.

ఎవర్‌గ్రీన్‌ కోర్సు – EEE

ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ (ఈఈఈ) విద్యార్థులకు రెండు రంగాల్లోను పట్టు లభిస్తుంది. ఎలక్ట్రికల్‌ టెక్నాలజీ , మెషీన్స్‌, మోటార్లు, పవర్‌ ఇంజినీరింగ్‌ వంటి అంశాలను ఇందులో చదువుతారు.

క్రేజీ తగ్గని CIVIL ఇంజినీరింగ్‌

సివిల్‌ ఇంజినీరింగ్‌ మౌలిక వసతుల ప్రాజెక్టులలో ప్లానింగ్‌, డిజైనింగ్‌, నిర్మాణం, నిర్వహణ వంటి బాధ్యతల్ని చూసే ప్రధాన బ్రాంచ్‌. సాలిడ్‌ మెకానిక్స్‌, హైడ్రాలిక్స్‌, స్ట్రక్చరల్‌ అనాలసిస్‌, సర్వేయింగ్‌ వంటి అంశాలను ఇందులో అధ్యయనం చేస్తారు.

Mechanical ఇంజినీరింగ్‌

మెకానికల్‌ ఇంజినీరింగ్‌ ఎవర్ర్ గ్రీన్‌ బ్రాంచ్‌గా పేరొందింది. యంత్రాలు, ఆటోమొబైల్స్‌, ఎలక్ట్రికల్‌ మోటార్లు వంటి విభాగాలలో మెకానికల్‌ ఇంజినీర్లు కీలక పాత్ర పోషిస్తారు. థర్మోడైనమిక్స్‌, మెషిన్‌ డ్రాయింగ్‌, ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌ వంటి సబ్జెక్టులను ఇందులో చదువుతారు.

Chemical ఇంజినీరింగ్‌కు డిమాండ్‌

కెమికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులను ఆకట్టుకుంటోంది. కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, మ్యాథమేటిక్స్‌ సమ్మిళితంగా ఉండే ఈ బ్రాంచ్‌లో నానో టెక్నాలజీ, బయో ఇంజినీరింగ్‌, మెటీరియల్‌ ప్రాసెసింగ్‌ వంటి సరికొత్త విభాగాలు పుట్టుకొస్తున్నాయి.

Also read: AP Deepam Scheme: దీపం పథకానికి అర్హులు ఎవరు? ఎలా అప్లై చెయ్యాలి?

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలాంగ్ మా Telegram మరియు Whatsapp ఛానల్ లో చేరండి. 👇👇

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment