Advertisement
AP Volunteers: ఆంధ్ర ప్రదేశ్‌లో వాలంటీర్ల భవిష్యత్తు ఇంకా సందిగ్ధతలో ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని వాలంటీర్లకు ప్రతి నెలా ఇస్తున్న రూ.200 పేపర్ భత్యం నిలిపివేయనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ ప్రభుత్వం కాలంలో, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు వాలంటీర్లకు పేపర్ భత్యం అందించేవారు. సర్క్యులేషన్ ఎక్కువగా ఉన్న పేపర్లను కొనుగోలు చేసేందుకు 2.60 లక్షల మంది వాలంటీర్లకు ప్రతి నెలా రూ.200 చెల్లించేవారు. అయితే, ఏపీ ప్రభుత్వం ఈ భత్యాన్ని ఆపుతున్నట్లు సమాచారం.
Advertisement
పింఛన్ల పంపిణీలో మార్పు
జులై నెల పింఛన్ల పంపిణీకి కూడా వాలంటీర్లను దూరం పెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటికీ పింఛన్ పంపిణీ చేయాలని నిర్ణయించారు. మంత్రివర్గ సమావేశం తర్వాత మంత్రి కొలుసు పార్థసారథి ఈ విషయాన్ని మీడియాకు వివరించారు. వాలంటీర్ల సేవలను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై ఇంకా ఆలోచనలు జరుగుతున్నట్లు మంత్రి చెప్పారు.
వాలంటీర్ వ్యవస్థ భవిష్యత్తు
ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని ప్రకటించారు. అలాగే గౌరవ వేతనాన్ని 5 వేల నుంచి 10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. సచివాలయాలు, వాలంటీర్ల శాఖ బాధ్యతలను మంత్రి డోల బాలవీరాంజనేయస్వామికి అప్పగించారు. ఈ నేపథ్యంలో వాలంటీర్లు తమ భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్నారు.
అంతేకాక, ఎన్నికల సమయంలో వైసీపీకి మద్దతుగా రాజీనామాలు చేసిన వారు తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలంటూ టీడీపీ నేతలను కలుస్తున్నారు. మరికొన్ని చోట్ల వైసీపీ నేతల బలవంతంతోనే రాజీనామాలు చేశారంటూ పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. సోమవారం మంత్రివర్గ సమావేశంలో పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను తప్పించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Advertisement
Sirmynameyabhinayagivejob.