Advertisement
eShram card: మిత్రులందరికీ నమస్కారం!! ఈరోజు కథనం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే eShram కార్డు గురించి తెలియజేస్తాము. ఈ కార్డు మీ కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవచ్చు. eShram కార్డు దరఖాస్తు చేసుకోవడనికి మీరు అధికారిక వెబ్సైటు అయిన eshram.gov.in ను సందర్శించాలి. ఎందుకంటే eShram కార్డు వలన చాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పటికే మీరు ఈ కార్డు ఎలా దరఖాస్తు చేసుకోవాలని ఆలోచిస్తున్నారు కదా! అయితే ఈ కథనం పూర్తిగా చదివితే మీ మొబైల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Table of Contents
eSharam కార్డు వలన ప్రయోజనాలు?
ఇ-శ్రమ్ కార్డు ద్వారా పొందే ప్రయోజనాలు చాల ఉన్నాయి. మీరు 2 లక్షల రూపాయలు భీమా ద్వారా పొందుతారు. అంటే మీరు ప్రదవశాత్తు ఏమైనా జరిగి మీకు ఎమన్నా జరిగితే, మీ మీద ఆధారపది ఉన్న ఉన్నవారికి ప్రభుత్వం ద్వారా 2 లక్షల రూపాయలు బీమా ద్వారా పొందుతారు.
Advertisement
అంతే కాకుండా మీకు 60 సంవత్సరాల తర్వాత నుండి మీకు పింఛను ద్వారా నెల నెల రూ. 3 వేల రూపాయలు పొందుతారు. కార్మికుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని మొదలు పెట్టింది.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
మీరు eShram కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడనికి ఈ క్రింది దశలను అనుసరించండి.
- మొదటిగా మీరు eShram అధికారిక వెబ్సైటు (eshram.gov.in) ఓపెన్ చెయ్యాలి.
- తర్వాత మీ “REGISTER on eShram” పైన క్లిక్ చేయండి.
- ఆధార్ కార్డు నెంబర్ నమోదు చేసి వెరిఫై చేయండి. అలాగే అక్కడ అడిగిన వివరాలు అన్ని పూరించండి.
- చివరిగా నమోదు చేసిన వివరాలు మరొక సరి చూసుకొని, సబ్మిట్ చేయండి.
- తద్వారా మీరు eShram కార్డు పోస్టులో మీ ఇంటి చిరునామా కి వస్తుంది.
Advertisement