Advertisement
NPCIL Recruitment 2024: మిత్రులందరికీ నమస్కారం!! ఈరోజు కథనం ద్వారా Nuclear Power Corporation of India Limited నుండి విడుదల అయిన ఉద్యోగ నోటిఫికేషన్ గురించి తెలియజేస్తాము. 10వ తరగతి, ఇంటర్ లేదా డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు, ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. NPCIL నుండి Stipendiary Trainee, Nurse పోస్టులకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి మీకు ఈ క్రింది తెలియజేసిన అర్హత ప్రమాణాలు పూర్తి చేసి ఉండాలి.
Table of Contents
- NPCIL Recruitment 2024
- NPCIL Recruitment Notification PDF
- ముఖ్యమైన తేదీలు
- Eligibility Criteria for NPCIL Recruitment Notification
- దరఖాస్తు రుసుము
- NPCIL ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చెయ్యాలి?
NPCIL Recruitment 2024
పోస్ట్ వివరాలు | స్టైపెండరీ ట్రైనీ, నర్సు |
మొత్తం ఖాళీలు | 74 |
జీతం | రూ.20000-67350/- నెలకు |
దరఖాస్తు చేయు విధానం | ఆన్లైన్ |
NPCIL అధికారిక వెబ్‌సైట్ | npcilcareers.co.in |
NPCIL Recruitment Notification PDF
మీరు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ నుండి విడుదల అయిన ఉద్యోగ నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింద ఉన్న బటన్ పైన క్లిక్ చేయండి.
Advertisement
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ | 16 జులై 2024 |
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | 5 ఆగష్టు 2024 |
దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేదీ | 5 ఆగష్టు 2024 |
Eligibility Criteria for NPCIL Recruitment Notification
మిత్రులారా, మీరు ఈ ఉద్యోగానికి ధరఖాస్తుకి చేయడానికి ఈ క్రింద తెలియజేసిన అర్హతలు పూర్తి చేసి ఉండాలి.
వయో పరిమితి
మీరు దరఖాస్తు చేయడానికి కనిష్ఠంహ 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 30 సంవత్సరాల వయస్సు ఉండాలి.
వయస్సు సడలింపు
- OBC (NCL) అభ్యర్థులకు 03 సంవత్సరాలు
- SC/ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు
- PwBD (UR/EWS) అభ్యర్థులకు 10 సంవత్సరాలు
- PwBD [OBC (NCL)] అభ్యర్థులకు 13 సంవత్సరాలు
- PwBD (SC/ST) అభ్యర్థులకు 15 సంవత్సరాలు
విద్యార్హతలు
- నర్సు -ఎ మరియు స్టైపెండరీ ట్రైనీ/ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 12వ, డిప్లొమా, B.Sc పూర్తి చేసి ఉండాలి.
- స్టైపెండియరీ ట్రైనీ/ (ST/TN) పోస్టుల కొరకు 10వ తరగతి, ITI, 12వ తరగతి పూర్తి చేసి ఉండాలి.
- ఎక్స్-రే టెక్నీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తు రుసుము
మీరు NPCIL నుండి విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్ కొరకు దరఖాస్తు చేయదనాయికి జనరల్, EWS మరియు OBC అభ్యర్థులు రూ. 100/- నుండి రూ.150/- వరకు రుసుము చెల్లించాలి. SC/ST/PWBD మరియు మహిళలకు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
NPCIL ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చెయ్యాలి?
NPCIL ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి మీరు ఈ క్రింది దశలను అనుసరించాలి. అభ్యర్థులు ఆగష్టు 5వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలని గమనించాలి.
https://www.npcilcareers.co.in/MainSiten/DefaultInfo.aspx
- మొదటిగా మీరు పైన ఉన్న లింక్ క్లిక్ చెయ్యాలి. అక్కడ మీకు “Apply Online” అని కనిపిస్తుంది, క్లిక్ చేయండి.
- తర్వాత మీరు ఏ పోస్టుకు దరఖాస్తు చేయాలనుకుంటున్నారో అది ఎంచుకోండి.
- మీ పేరు, చిరునామా మరియు ప్రాధమిక వివరాలు పూరించండి.
- అలాగే తర్వాత దశలో మీరు విద్యార్హత వివరాలు పూరించాలి.
- మీరు అర్హులైతే దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
- కావాల్సిన పత్రాలు కూడా అడిగిన ఫార్మాట్ లో అప్లోడ్ చేయండి.
- చివరిగా నమోదు చేసిన వివరాలు మరొకసారి తనిఖీ చేసి, సబ్మిట్ చేయండి.
- Congrats!!! మీరు NPCIL ఉద్యోగానికి దరఖాస్తు చేసారు.
Also read: BSNL New Plans: కొత్తగా లాంచ్ చేసిన ప్లాన్ వివరాలు… ఇవి చాల చౌక ధరల్లో ఉన్నాయి
Advertisement