Advertisement
Dwacra News 2024: మిత్రులందరికీ నమస్కారం!! మా మరొక కథనానికి స్వాగతం సుస్వాగతం. మిత్రులారా ఇప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఒక నెల కానుంది. ఎన్నికలు ముందు చెప్పిన సంక్షేమ పథకాలను అమలు చేయడానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. అదే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఆగస్టు 15వ తారీకు నుండి ప్రారంభిస్తాం అని కూడా ప్రకటించారు. ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిన పథకాలను ఒకటి తర్వాత ఒకటి అమలు చేయాలని సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. అందులో భాగంగానే డ్వాక్రా మహిళలకు కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పారు. తెలుసుకోవాలి అనుకుంటే ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.
ఈ డ్వాక్రా మహిళలకు ఒక గుడ్ న్యూస్ ఏమిటంటే రూ.2 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు లోన్ అనేది పెంచడం జరిగినది. అలాగే ఎస్సి, ఎస్టీ డ్వాక్రా మహిళలకు రూ.50 వేల నుండి 5 లక్షల రూపాయల వరకు లోన్ అనేది 0 వడ్డీతో ఇవ్వనున్నారు. ఇప్పటివరకు కూడా రెండు లక్షల వరకు లోన్ అనేది సున్నా వడ్డీకి ఇచ్చారు. ఇప్పటివరకు ఈ రుణం అనేది రెండు లక్షల వరకు ఉండగా ఇప్పుడు తాజాగా ఈ రుణాన్ని 5 లక్షల రూపాయలకు పెంచారు.
Advertisement
డోక్రా మహిళలకు ఈ లోన్ ఇవ్వడం కోసం ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి గాను రూ.250 కోట్ల రుణముగా ఇవ్వాలని అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. డ్వాక్రా సంఘాలలో సభ్యులుగా ఉన్న ఎస్సీ ఎస్టీ మహిళలకు ఈ లోన్ అనేది రెండు లక్షల నుండి 5 లక్షల రూపాయలకి పెంచడం జరిగినది. వాళ్లు తీసుకున్న ఈ రుణాన్ని ద్వారా తిరిగి చెల్లించాలి. మంచి విషయం ఏమిటి అంటే సున్నా వడ్డీ, అంటే ఎటువంటి వడ్డీ కట్టకుండా మనం ఎంత అయితే తీసుకున్నామో అసలు మాత్రమే వాయిదాల రూపంలో తిరిగి చెల్లించాలి. డ్వాక్రా సంఘాల్లో ఎస్సి, ఎస్టీ మహిళలకు ఇదొక మంచి అవకాశం.
మిత్రులారా మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులతో షేర్ చేసుకుంటారని ఆశిస్తున్నాము. అలాగే ఈ వెబ్సైట్ ద్వారా మీరు ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మరియు తాజా వార్తలను కూడా పొందవచ్చు.
ఉన్నతి పథకం కింద డ్వాక్రాలో మహిళలు రెండు లక్షల వరకు లోన్ అయితే పొందారు. ఇప్పటి నుండి డ్వాక్రా సంఘం లో ఉన్న ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఈ లోన్ అనేది రూ.2 లక్షల నుండి రూ.5 లక్షలకు పెంచడం వల్ల వాళ్లకు చాలా ఊరట లభించింది. డ్వాక్రా సంఘాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ మహిళలు చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అభివృద్ధి చెందాలి అనే లక్ష్యంగా పెట్టుకున్నారని మనం భావించవచ్చు. ఇంకో రూ.250 కోట్లను జోడించి మొత్తం రూ.500 కోట్ల వరకు నిధులు పెంచడం జరిగినది.
Also read: రేషన్ కార్డు లేకపోయినా పర్వాలేదు రూ. 2 లక్షలు రుణ మాఫీ ఖాయం..
Advertisement